ETV Bharat / state

ఆలయాల్లో, దుకాణాల్లో.. చోరీలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్​

ఆలయాల్లో, దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని విజయనగరం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు బాలురు ఉన్నారు. ప్రధాన నిందితుడితో పాటు ముగ్గురు బాలనేరస్థులను అరెస్టు చేసి.. వారి నుంచి హుండీలోని నగదుతో పాటు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలియచేశారు.

sp
ఆలయాల్లో, దుకాణాల్లో.. చోరీలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్​
author img

By

Published : Feb 11, 2021, 5:40 PM IST

ఆలయాలు, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడితో పాటు, ముగ్గురు బాల నేరస్థులను విజయనగరం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజకుమారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ రాత్రి విజయనగరం రంగిరీజు వీధిలోని మరిడమ్మ గుడిలో దొంగలు హుండీ ఎత్తుకు పోయినట్లుగా స్థానికులు ఒ‍కటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ప్రార్ధనా మందిరాలు, ఆలయాల్లో జరుగుతున్న నేరాలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు.

మరిడమ్మ ఆలయ సమీపంలోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించగా.. నేరం జరిగిన రాత్రి ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతున్నట్లుగా గుర్తించారు. గతంలో దొంగతనాల కేసుల్లో అరెస్టైన పాత నేరస్థుడు దుర్గా ప్రసాద్​తో పాటు మరో బాలనేరస్తుడ్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మరో ఇద్దరు బాల నేరస్థుల సహాయంతో మరిడమ్మ ఆలయంలో హుండీ దోపిడికి పాల్పడినట్లు అంగీకరించారని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడితో పాటు, ముగ్గురు బాలనేరస్థులను అరెస్టు చేసి, వారి నుంచి హుండీలోని నగదుతో పాటు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

డబ్బులేశాం.. బళ్లు పెట్టాం.. వచ్చి ఓటేసిపొండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.