కుటియా గ్రామప్రజలతో మాజీ ఎంపీ కొంపంగి సమావేశమయ్యారు. తమ ప్రాంతంలో పాఠశాల, వైద్య సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరారు. స్థానికులు మట్టిరోడ్డు నిర్మించుకున్నాక.. సినీ నటుడు సోనూసూద్ స్పందించడంతో అధికారులు కదిలారు. ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి పది రోజుల్లో రహదారి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అయినా నేటికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని.. గ్రామస్థులు ఆవేదన చెందారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండీ.. పేద, మధ్య తరగతులపై ధరల భారం