విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెదేపా అధినేత చంద్రబాబుకు పంపారు. ఐదేళ్ల నుంచి పార్టీలో సరైన గుర్తింపు లేదని తెలిపారు. అందుకే తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి గెలుపునకు కృషి చేశారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గ్రామ వాలంటీర్‌గా రాజీనామా.. సర్పంచి అభ్యర్థిగా నామినేషన్..!