విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొండవానిపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 40పూరిళ్లు దగ్ధమవ్వగా... 25లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం సంభవించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
మొదట ఓ ఇంట్లో ప్రారంభమైన మంటలు క్రమేపి ఊరంతా వ్యాపించాయి. ఉదయమే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ పనుల కోసం వెళ్లిన గ్రామస్థులు సాయంత్రం వచ్చే లోపు ఇళ్లన్నీ కాలి బూడిదపాలయ్యాయి. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: చెరకు లారీ బోల్తా .. రాకపోకలకు అంతరాయం