ETV Bharat / state

అక్కరకు రాని కొనుగోలు కేంద్రాలు... రైతులకు మిగులుతోంది కన్నీళ్లు...

author img

By

Published : Feb 14, 2020, 8:00 AM IST

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలోని రైతుల పరిస్థితి దయానీయంగా మారింది. ఎప్పుడో పండగ ముందు పూర్తి కావలసిన తంతు ఇప్పటికీ పట్టాలెక్కలేదు. నెలలు గడుస్తున్నా పంట అమ్ముడుపోకే రైతులు విసుగెత్తి పోతున్నారు.

grain purchasing authorities
కొనుగోలు కేంద్రాల అధికారుల నిర్లక్ష్యం

ఫిబ్రవరి గడిచిపోతున్నా.. విజయనగరం జిల్లా రైతుల కష్టాలు తీరలేదు. సాలూరు మండలం బాగవలస, మామిడిపల్లి, శివరాంపురం పీఎస్ పరిధిలో చాలా వరకు ధాన్యం కొనుగోలు చెయ్యక కల్లంలోనే పంట ఉండిపోయింది. జనవరి 11 నుంచి కొనుగోలు కేంద్రాల్లో పంట కొనుగోలు నిలిపేశారు. అనంతరం కొన్ని రోజులు తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ రైతులు తీసుకొచ్చిన రకాలు కొనుగోలు అప్పటికే పూర్తైందన్న అధికారుల సమాచారం రైతు కంటతడిపెట్టిస్తోంది.

కుప్పలను వర్షాల నుంచి రక్షించుకుంటూ సంచుల్లో ఎత్తిన ధాన్యాన్ని ఏం చేయాలో పాలుపోక రైతు దిగాలు చెందుతున్నాడు. మండలంలో ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. ధాన్యం కొనుగోలు మాత్రం అంతంత మాత్రంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కొనుగోలు కేంద్రాల అధికారుల నిర్లక్ష్యం

అధికారులు మాత్రం అదిగో ఇదిగో అంటూ కారణాలు చెబుతూ.. కాలం వెల్లదీస్తున్నారు. వర్షాలు పడితే ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎటూ కాకుండా పోతుందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఇవీ చూడండి...

సాలూరులో అదుపుతప్పి పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.