ETV Bharat / state

Construction: నెరవేరని ఈఎస్‌ఐ ఆసుపత్రి కల.. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం

విజయనగరం జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన జరగ్గా.. కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా వైద్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోతాయనుకున్నారు. కానీ ఇప్పటికీ నిర్మాణ పనులు శిలా ఫలకానికే పరిమితమయ్యాయి. ఆసుపత్రి నిర్మాణ స్థలం సాధారణ వైద్య కళాశాలకు కేటాయించటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

esi hospital construction has stopped in vizianagaram
విజయనగరంలో నెరవేరని ఈఎస్‌ఐ ఆసుపత్రి కల
author img

By

Published : Sep 5, 2021, 3:53 PM IST

విజయనగరంలో నెరవేరని ఈఎస్‌ఐ ఆసుపత్రి కల

విజయనగరం జిల్లా(Vizianagaram district) ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ వైద్య పరంగా ఇప్పటికీ పక్కనున్న జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. కార్మికుల వైద్యమైనా ఇదే దైన్యం. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ.. కేంద్ర ప్రభుత్వం విజయనగరంలో ఈఎస్ఐ(ESI) ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2019 డిసెంబర్ 19న విజయనగరంలో రూ.75కోట్లతో మంజూరైన ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బొత్స సత్యనారాయణ సహా పలువురు రాష్ట్ర మంత్రులూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండేళ్లలో పనులు పూర్తిచేసి.. ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. రెండేళ్లు కావస్తున్నా కనీసం పునాదిరాయి పడలేదు.

పదేళ్ల కిందటే ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన

విజయనగరం మండలం గాజులరేగ పంచాయతీ ఏయూ ప్రాంగణ సమీపంలో ఈఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. వాస్తవానికి పదేళ్ల కిందటే ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. నాటి ప్రజాప్రతినిధులు స్థలాన్నిచూసి ఆమోదించారు. తీరా ఆ స్థలంపై న్యాయస్థానంలో కేసు ఉన్నందున మరో చోట కడదామనుకున్నారు. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన కారణాలతో ఆసుపత్రి ప్రతిపాదనలకే పరిమితమైంది. 2019లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కదలిక వచ్చిందనుకుంటే పనుల్లో మాత్రం ముందడుగు పడలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి

ఐదు ఎకరాలపైనా నీలినీడలు

ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి.. విజయనగరం మండలం గాజులరేగ పంచాయతీ ఏయూ ప్రాంగణ సమీపంలో కేటాయించిన ఐదు ఎకరాలపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 70 ఎకరాల సువిశాల స్థలంలో దాదాపు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విజయనగరం వైద్య కళాశాల భవనాలను నిర్మించనున్నారు. అవసరమైతే ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించిన స్థలాన్నీ వినియోగించుకుంటామని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈఎస్‌ఐ ఆసుపత్రి విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కార్మికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: MP VIJAYA SAI: 'విశాఖ-విజయనగరం జంటనగరాలవుతాయి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.