విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టిలో వైకాపాకు చెందిన ఇద్దరు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగారు. గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న దొరలతాడివలస వరకు అభ్యర్థులిద్దరూ భారీ ర్యాలీ నిర్వహించారు. తమకే ఓటు వేయాలని ప్రజలను వేడుకున్నారు.
ఈ ప్రచారంలో గిరిజన మహిళలు చేసిన థింసా నృత్యం ఆకట్టుకుంది. మేళతాళాలతో కూడిన నృత్యం ప్రచారానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే రోజు ఇద్దరు అభ్యర్థులు ప్రచారం నిర్వహించిన కారణంగా... గ్రామంలో సందడి నెలకొంది. ఇరువురి ర్యాలీలు ఎదురుపడ్డాయి.
ఇదీ చదవండి: