ETV Bharat / state

'యువత క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలి'

జిల్లాలో ఎనిమిది రోజులుగా జరిగిన 'ఈనాడు' క్రీడా పోటీలు అట్టహాసంగా ముగిశాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో విన్నర్, రన్నర్ జట్లకు విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మెహర్ బాబా, తిరుమల ఆసుపత్రి అధినేత తిరుమల ప్రసాద్ బహుమతులు అందచేశారు.

eenadu-cricket-league-compleated-in-vijayanagaram
ముగిసిన "ఈనాడు" క్రీడా పోటీలు
author img

By

Published : Dec 25, 2019, 3:07 PM IST

'యువత క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలి'

'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు విజయనగరం జిల్లాలో అట్టహాసంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మెహర్ బాబా, తిరుమల ఆసుపత్రి అధినేత తిరుమల ప్రసాద్​ హాజరయ్యారు. విజయనగరంలోని విజ్జీ, ఎంఆర్ క్రీడా మైదానాల్లో 8 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లో 69 జట్లు పాల్గొన్నాయి. జూనియర్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో ధర్మపురి ఎల్డీజీ జూనియర్ కళాశాల, ఎస్.కోట పుణ్యగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్లు తలపడగా... ఎల్డీజీ జూనియర్ కళాశాల విజేతగా నిలిచింది.

సీనియర్ విభాగంలో బొబ్బిలి తాండ్రపాపారాయుడు, విజయనగరం సీతం ఇంజినీరింగ్ కళాశాలల జట్లు పోటీపడగా... తాండ్రపాపారాయుడు జట్టు విజేతగా నిలిచింది. రెండు విభాగాల్లోని విన్నర్, రన్నర్ జట్లకు అతిథులు బహుమతులు అందజేశారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ... గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 'ఈనాడు' చేస్తున్న కృషిని అభినందించారు. యువకులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

ఇదీ చదవండి

బైక్ అంబులెన్స్​లో ప్రసవం... తల్లీబిడ్డ క్షేమం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.