విజయనగరం జిల్లా మక్కువ మండలంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో శంబర పోలమాంబ జాతర జరగనుంది. ఈ జాతరను ప్రజలు ఇళ్ల వద్దనే నిర్వహించుకుని.. పూజలు చేసుకోవాలని డీఎస్పీ సుభాష్ విజ్ఞప్తి చేశారు. వేడుకల నిర్వహణపై సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, సబ్ ఇన్స్పెక్టర్తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.
బయటి నుంచి వచ్చే వారు ఎవరైనా ఉంటే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి... గ్రామస్థులు బంధువులను పిలవకుండా కుటుంబ సభ్యులతో పూజలు చేసుకోవాలని సూచించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ.. వేడుక చేసుకోవాలని.. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: