ETV Bharat / state

జిల్లాలో ఈ నెల 25,26 తేదీల్లో ఇంటింటి సర్వే

విజయనగరం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టరేట్​లో ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25,26 తేదీల్లో ఇంటింటి సర్వే చేపట్టి కరోనా అనుమానితులను గుర్తించి పరీక్షలు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.

http://10.10.50.85//andhra-pradesh/21-July-2020/ap_vzm_10_21_carona_pai_karyacharana_av_ap10194_2107digital_1595342977_876.jpg

author img

By

Published : Jul 22, 2020, 10:29 AM IST

విజ‌య‌న‌గ‌రంలో గ‌త‌కొద్ది రోజులుగా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి సూచ‌న‌ల మేర‌కు ఈనెల 25,26 తేదీల్లో ఇంటింటి స‌ర్వే నిర్వ‌హించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. దీనిపై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, వైద్యాధికారులు, పోలీసు అధికారుల‌తో స‌మావేశం నిర్వహించారు.

ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు క‌ష్ట‌కాలంలో ఉన్నార‌ని, వారిని ఆదుకోవాల్సిన బాధ్య‌త అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఉంద‌ని ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి స్ప‌ష్టం చేశారు. జిల్లా కేంద్రంలో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి అధికారుల స‌హ‌కారంతో ప‌లు చ‌ర్య‌ల‌ను తీసుకున్నామ‌ని తెలిపారు.

వ్యాపారులు స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌టం కూడా దీనిలో భాగ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జా శ్రేయ‌స్సు దృష్ట్యా లాక్‌డౌన్‌కు ఈనెల 31 వ‌ర‌కు పొడిగించారన్నారు. క‌రోనాను ముందుగానే గుర్తించ‌టం ద్వారా, దానిని న‌యం చేయ‌టం సులువు అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇంటింటికీ స‌ర్వే నిర్వ‌హించి, 60 ఏళ్లు పైబ‌డ్డ‌వారిని, క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న‌వారిని, జ్వ‌ర పీడితుల‌ను గుర్తించి, వారంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని తెలిపారు.

ప‌ట్ట‌ణంలో తొలిరోజు 25 వార్డులు, రెండో రోజున మిగిలిన 25 వార్డుల్లో స‌ర్వే నిర్వ‌హిస్తామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ కుమార్ చెప్పారు. వార్డు వాలంటీర్లు, వార్డు స‌చివాల‌య సిబ్బంది, ఎఎన్ఎంలు, వైద్య సిబ్బంది, పోలీసులతో బృందాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

ఇదీ చూడండి

పల్లె సీమలను పచ్చగా మార్చేందుకు 71వ వనమహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.