ETV Bharat / state

'డిజిటల్ కియోస్క్​ల వినియోగంపై శిక్షణ' - డిజిటల్ కియోస్క్

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాల్లో.. డిజిటల్ కియోస్క్​ల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులకు, ఆగ్రోస్ వ్యవసాయ శిక్షణ కేంద్రాల అధికారులకు... డిజిటల్ కియోస్క్​ల గురించి విజయనగరం రైతు శిక్షణ కేంద్రంలో అవగాహన కల్పిస్తున్నారు.

digital classes
digital classes
author img

By

Published : May 5, 2020, 7:00 PM IST

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో డిజిటల్ కియోస్క్​లను ఏర్పాటు చేసింది. దీనిపై మొదటిసారిగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో శిక్షణ ప్రారంభించారు. రైతులకు గ్రామస్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల సరఫరాకు డిజిటల్ కియోస్క్ ఉపయోగ పడుతుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు డి.ఆశాదేవి, ఆత్మ పథకం సంచాలకులు డి.లక్ష్మణరావు, డిజిటల్ కియోస్క్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిరంజన్ కుమార్, అగ్ మెటల్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు ప్రమోద్, నిరంజన్ కుమార్ పాల్గొన్నారు.

ఇవీ చదవండి: ఎయిర్​లిఫ్ట్​: 7 రోజులు.. 64 విమానాలు.. 14,800 మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.