విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి కుడిప్రధాన కాలువ రహదారిపై గుంత పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మధ్యలో భారీగా గండి పడింది. ఈ ఘటనతో పార్వతీపురం-శ్రీకాకుళం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారికి మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.