విజయనగరం జిల్లాలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని.. బాధితులకు చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ జిల్లా దళిత హక్కుల జేఏసీ ధర్నా చేపట్టింది. కలెక్టరేట్ వద్ద ఆ సంఘం కార్యదర్శి గండ్రేటి సత్యనారాయణ ధర్నా నిర్వహించారు.
జిల్లాలో నిత్యం వందలాది మంది కొవిడ్-19 వైరస్ బారిన పడుతున్నారు. కానీ సకాలంలో నిర్దారణ పరీక్షలు జరగటం లేదు. పరీక్షలు చేసినా ఫలితాలు వచ్చేలోపు వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కొవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లలో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని.. పౌష్టికాహారాన్ని అందించాలని సత్యనారాయణ అధికారులను డిమాండ్ చేశారు .
ఇవీ చదవండి