పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మిగిలిన ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీసుల పనితీరు ప్రశంసనీయమన్న ఆయన.. ఇప్పటివరకు చెదురుమదురు ఘటనలు జరిగినట్లు తెలిపారు. అన్ని ఫిర్యాదులపైనా స్పందిస్తున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా కొత్తవలస పోలింగ్ కేంద్రాన్ని డీజీపీ సవాంగ్ పర్యటించి.. పోలింగ్ సరళిపై ఎస్పీ, జేసీని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం