కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతంలో కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చెప్పారు. ప్రజలు కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనాను తరిమికొట్టడంలో తమ వంతు పాత్రను పోషించాలని ఆమె కోరారు. జిల్లాలో కరోనా కంటోన్మెంట్ జోన్‌గా గుర్తించిన గరుగుబిల్లి మండల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి సందర్శించి అక్కడ కరోనా నియంత్రణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, సూచనలు ఇచ్చారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎవ్వరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఖచ్చితంగా సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సబ్ కలెక్టర్ అంబేద్కర్, గరుగుబిల్లి మండల అధికారులు పాల్గొన్నారు.
ఇది చదవండి మరో ఘోరం: సొంతగూటికి చేరేలోగా మృత్యు ఒడికి!