ప్రజల కష్టసుఖల్లో పాలుపంచుకునే వాలంటీర్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి పేర్కొన్నారు. కురుపాం మండల కేంద్రంలో కురుపాం నియోజకవర్గంలో పనిచేస్తున్న వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె... సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి ప్రజలకు ఇంటివద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి సామాన్య మానవుడికి వారధి వాలంటీర్లేనని కొనియాడారు.
ఇవీ చూడండి: