విజయనగరం జిల్లాకు ఫొని ముప్పు తప్పింది. తుపాను తీరం దాటి ఒడిశా దిశగా పయనిస్తోంది. ఈదురు గాలుల వల్ల వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు కొంత మేర జరిగిన నష్టం మినహా.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించ లేదు. జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి 12గంటల వరకు ఓ మోస్తారు వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 12 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. తెర్లాం, మొరకముడిదాం, దత్తిరాజేరు, గుర్ల, గరివిడి, చీపురుపల్లి, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో అత్యధికంగా వర్షం పడింది.
ఇవీ చదవండి..భారీ ఈదురు గాలులు...వర్షాలు..!