విజయనగరం జిల్లా సాలూరు మండలం అన్న గిరిశిఖర గ్రామంలో కరోనా భయం.. ఓ గర్భిణీని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. గ్రామానికి చెందిన కునేటి అనే మహిళకు పురిటినొప్పులతో ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు ఆమె భర్త. అయితే కరోనా దృష్ట్యా గ్రామంలోనికి ఎవరినీ అనుమతించకుండా రహదారికి అడ్డంగా.. గ్రామస్థులు కర్రలు, దుంగలు వేశారు. దీని వల్ల గ్రామంలోకి వాహనం రావడానికి ఇబ్బంది తలెత్తింది. మహిళను ఆస్పత్రికి తరలించే లోపు మార్గమధ్యలోనే ప్రసవించింది.
ఇవీ చదవండి: