విజయనగరం జిల్లా కలెక్టరేట్లో అధికారులు ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి రోజురోజుకి ఎక్కువ అవుతున్నందున కనీసం 14 రోజుల నుంచి 30 రోజుల వరకు లాక్డౌన్ కఠినంగా అమలు చెయ్యాలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.
రైతుబజార్ల వద్ద, మార్కెట్లలో, నిత్యావసర సరకులు కొనుగోలు దగ్గర భౌతికదూరాన్ని పాటించటం లేదని, ముఖ్యంగా మద్యం దుకాణాల వద్ద గుంపులు, గుంపులుగా ఉంటున్నారని, మాస్క్లు వినియోగించటం లేదని వీటిపై కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని త్వరగా ఫలితాలు కూడా తెలియజేయాలని కొంతమంది కోరారు. కరోనా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కలిగించాలని ప్రజలు తెలిపారు.
ఆర్ అండ్ బీ రైతు బజారులో వినియోగదారులు అధికంగా వస్తున్నందున అలకనందా కాలనీలో ఉన్న పార్కులోనికి బజారు తరలించాలని కొంతమంది కోరారు.
స్వీకరించిన ఫోన్ కాల్స్ వివరాలను సంబంధిత శాఖలకు పంపిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. లాక్ డౌన్ విషయమై జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి