ETV Bharat / state

కొవిడ్ బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ - జిల్లా కలెక్టర్ హరి జవహర్​లాల్ తాజా వార్తలు

కొవిడ్ బాధితులకు, ఇంటి వద్ద చికిత్స పొందుతున్న నిరుపేదలకు ఉచితంగా హోం ఐసోలేషన్ కిట్లును పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ హరి జవహర్​లాల్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. కరోనా బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు అందజేశారు.

హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేసిన కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ

author img

By

Published : May 11, 2021, 9:45 PM IST

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. కరోనా బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కె.ఆర్.డి ప్రసాదరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ వైద్యులు సీహెచ్ వేణుగోపాల రెడ్డిలు కలెక్టర్​తో కలిసి మందులు అందజేశారు. కొవిడ్ పాజిటివ్ రిపోర్టు, ఆధార్ కార్డును చూపించి.. కలెక్టర్ ఆఫీసు దగ్గరలో ఉన్న రెడ్ క్రాస్ నూతన భవనంలో హోం ఐసోలేషన్ కిట్లు పొందవచ్చని తెలిపారు.

అంతర్జాతీయంగా ఆమోదం పొందిన మందులతో కూడిన కిట్లను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటివద్దనే చికిత్స పొందుతూ, వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ కొవిడ్​ను జయించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జూనియర్ కోఆర్డినేటర్ ఎం. రామ్మోహన్ రావు, రెడ్ క్రాస్ జిల్లా క్షేత్రాధికారులు డి. గౌరీ శంకర్ ఎన్. చంద్ర రావు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

కోవిడ్ బాధితుల సమస్యలు పరిష్కరించండి: సీఐటీయూ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.