విజయనగరం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. అందుకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించామన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ రాజకుమారితో పాటు పలు శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో ఎన్నికల సిబ్బంది, సామాగ్రి, ఎన్నికల నియమావళి, సమస్యాత్మక, అతిసమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, భద్రతా సిబ్బంది అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండు, మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు, సిబ్బంది అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన ఎన్నికల నియమాలను తెలియచేశారు. ఎన్నికల భద్రతా చర్యల్లో భాగంగా పోలీసుశాఖ చేపడుతున్న చర్యలను ఎస్పీ రాజకుమారి వివరించారు.
ఇదీ చదవండి: