కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరికాదని, ప్రధాని మోదీ దేశ ప్రజలను మోసగిస్తున్నారని సీఐటియూ నాయకులు ఆరోపించారు.
కరోనా సంక్షోభం నుంచి ప్రజలను రక్షించకుండా ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారని జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ ప్రశ్నించారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ చేయడం ఆపకపోతే ఈ నెల 17న రైల్వే ఉద్యోగులను, ప్రజలను కలుపుకొని దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఎదుట ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, రెడ్డి శంకర్రావు, రమణ, జగన్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...