విజయనగరంలోని ఈ-పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కూమార్ చౌభే పరిశీలించారు. అనంతరం జిల్లాలో నడుస్తున్న బాల సురక్ష వాహనాల పని తీరుపై ఆరా తీశారు. మీడియాతో మాట్లాడుతూ... స్వచ్ఛభారత్ తరహాలో స్వస్త్య భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలను సాకారం చేస్తున్నామన్నారు. గత ఐదేళ్లుగా ఎన్నో వినూత్న వైద్య, ఆరోగ్య పథకాలను ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యంతో కేంద్రం అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటి కల్లా క్షయ వ్యాధిని సమూలంగా నియంత్రించాలని లక్ష్యం నిర్థేశించుకోగా, 2025 నాటికే ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రధాన మంత్రి నిర్ధేశించారని వెల్లడించారు.
ఇదీ చూడండి