విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్లో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 14 మంది బాధితులకు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ నగదు అందించి వారిని స్వస్థలాలకు పంపారు. ఒక్కొక్కరికి రూ.2000 నగదు, మందులు అందజేశారు. ఇప్పటివరకు మిమ్స్ నుంచి 49 మంది విమ్స్ నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో నమోదైన మొత్తం 102 పాజిటివ్ కేసుల్లో 50 శాతం మంది చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్లినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి..
ప్రాజెక్టులకు నిధులెక్కడ?... ఆదాయం పెంచుకునే మార్గాలేవి: చంద్రబాబు