రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘం కల్పించుకోవాలని ఆయన కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తున్నామన్న కన్నా...భాజపా, జనసేన తరఫున వేసిన నామినేషన్లు తిరస్కరించడం దారుణమన్నారు. హిందూ ఆలయాలు, భూముల పరిరక్షణకు భాజపా కచ్చితంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: కరోనా నియంత్రణకు పట్నాయక్ 'సైకత' సందేశం