ETV Bharat / state

భీమసింగి చక్కెర కర్మాగారం ఎదుట రైతుల ఆందోళన - vijayangaram district latest news

భీమసింగి చక్కెర కర్మాగారం పరిధిలోని చెరుకు రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కర్మాగారాన్ని నిలిపివేయడం దారుణమన్నారు. తమ చెరుకును ఇక్కడే గానుగ ఆడాలంటూ డిమాండ్​ చేశారు. మరో చోటికి తరలించడం తాము అంగీకరించబోమన్నారు.

bheemasingi sugar factory farmers protest against factory closing for 2020-21 season in vijayangaram district
భీమసింగి చక్కెర కర్మాగారం వద్ద చెరుకు రైతుల నిరసన
author img

By

Published : Aug 28, 2020, 5:22 PM IST

విజయనగరం జిల్లాలో భీమసింగి సహకార చక్కెర కర్మాగారం పరిధిలోని చెరుకు రైతులు ఆందోళనకు దిగారు. 2020-21 కాలం​లో షుగర్​ ఫ్యాక్టరీని నిలుపుదల చేస్తూ ఇటీవల నోటీసు బోర్డులో ఎండీ కె. ఆర్​. విక్టర్​ బాబు వివరాలు ఉంచారు. ఫ్యాక్టరీ అధునీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇక్కడ చెరకును బొబ్బిలి ఎన్​సీఎస్​కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఈ చక్కెర కర్మాగారంపై ఆధారపడ్డ చెరుకు రైతులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కర్మాగారానికి 40 ఏళ్లుగా తాము చెరుకును సరఫరా చేస్తున్నామని... ముందస్తు సమాచారం లేకుండా ఈ పని చేయడం దారుణమని వాపోయారు. తమ చెరుకును ఇక్కడే గానుగా ఆడాలని... ఇతర ఫ్యాక్టరీలకు తరలిస్తే బిల్లుల చెల్లింపు సక్రంగా ఉండవని ఆవేదన తెలిపారు.

ఇదీ చదవండి :

కలెక్టర్​ కార్యాలయం వద్ద మహిళా సంఘాల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.