వేలాది మంది అయ్యప్ప స్వాములకు భవాని, శివ మాలధారులకు మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలోని అయ్యప్ప భక్తులు గత మూడేళ్లుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొదట్లో అన్నదానానికి 500 మంది మాత్రమే హాజరు కాగా... ప్రస్తుతం రోజుకు 1500 మంది అయ్యప్ప స్వాములు, ఇతర మాలధారులు హాజరవుతున్నారు. భోజనం ఏర్పాటు చేయడం వల్ల వివిధ పనులపై పట్టణానికి వచ్చే మాలధారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజు రూ.20 వేల వరకు ఖర్చవుతుందని నిర్వహకులు తెలిపారు.
ఇవీ చూడండి...'ఇబ్బంది పడుతున్నాం... వంతెన నిర్మించండి సార్'