శంబర పోలమాంబ జాతరకు విస్తృత ఏర్పాట్లు - Sambara Polambamba Jatara
విజయనగరం జిల్లా మక్కువ మండలం పరిధిలోని శంబర పోలమాంబ జాతర కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. గత ఏడాది 2 లక్షలమంది భక్తులు రాగా... ఈ సారి 5 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వేడుకల కోసం వంద బస్సులను ఏర్పాటు చేశారు. క్యూ లైన్, ఉచిత దర్శనం ఆన్లైన్ టికెట్లను అందుబాటులోకి తేనున్నారు.