జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తింపు కార్డులు, బస్ పాసులు ఇవ్వలేదన్నారు.
ఇలాంటి పరిస్థితి శోచనీయమని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి రమేష్ నాయుడు ఆవేదన చెందారు. జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.... పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు తీర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
విశాఖలో...
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు అందలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టి సారించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: