విజయనగరం జిల్లాలో కరోనా నియంత్రణపై జిల్లా అధికారులతో, విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్చార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యాక్సినేషన్, ఆసుపత్రులు, కరోనా కేర్ సెంటర్లలో సేవలపై చర్చించారు.
ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అందుతోన్న వైద్యం, తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి చర్యలు, వ్యాక్సిన్ల కొరతపై మంత్రులకు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, జిల్లా కొవిడ్ కేర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
నేను వ్యాక్సిన్ తెప్పిస్తే.. మీరెందుకు సీఎంగా ఉండటం?: చంద్రబాబు