విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థినులు తెలుగుతల్లి గీతాలాపన చేశారు. శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, ఇంఛార్జ్ కలెక్టర్ కిశోర్ కుమార్, జిల్లా ఎస్పీ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు, అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం నియోజకవర్గంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు... పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సాలూరు నియోజకవర్గంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రాజన్న దొర, వైకాపా నాయకులు, కార్యకర్తలు అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: