ETV Bharat / state

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం: అంగన్వాడీలు

Anganwadi Strike 31st Day in AP: డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు 31రోజులుగా సమ్మె చేస్తున్నారు. మూడు దఫాలుగా మంత్రులు చర్చలు జరిపినా స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. మరోసారి చర్చలు జరిపేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ యూనియన్‌ ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇప్పుడైనా స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని యూనియన్‌ నాయకులు పేర్కొంటున్నారు.

Anganwadi Strike
Anganwadi Strike
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 7:14 PM IST

Anganwadi Strike 31st Day in AP: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 31రోజు కొనసాగుతోంది. సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు దీక్ష చేశారు. బాపట్లలో అంగన్వాడీలు ఉరి తాళ్లు వేసుకుని ప్రభుత్వంపై పాటలు పాడుతూ ఆందోళన చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఒంటి కాలిపై నిలబడి నమస్కరిస్తూ నిరసన చేశారు. మోసపూరిత హామీలతో మభ్య పెట్టారంటూ అనంతపురంలో కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు కుర్చీలు తలపై పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోటిసులు ఇచ్చి భయపెట్టడం సిగ్గు సిగ్గు అంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీడీపీవో కార్యాలయం ఎదుట బైఠాయించి అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం: అంగన్వాడీలు

Anganwadi Problems Government Not Solve: అనంతపురం జిల్లా సింగనమల తహశిల్దార్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగనమల సీఐటీయు యూనియన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ 31 రోజులుగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందన్నారు. ఈ ప్రభుత్వంలో మాకు జీతాలు పెంచకపోయినా వచ్చే ప్రభుత్వంతోనైనా జీతాలు పెంచుకొని విధుల్లో చేరుతామని తెలిపారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి ఎన్నికల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలను మార్చుకుంటున్నారని మండిపడ్డారు.

బెదిరింపులకు పాల్పడినా సమ్మె విరమించం - స్పష్టం చేసిన అంగన్వాడీలు

Anganwadi Strike in All Districts: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు, కార్యకర్తలు మినీవర్కర్లు నిరవధిక సమ్మె నెల రోజులకు చేరింది. మూడు దఫాలుగా మంత్రులు చర్చలు జరిపినా స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడంతో సమ్మె కొనసాగుతూ వస్తోంది. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రకటించినా ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరిపేందుకు సీఐటీయు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ యూనియన్‌ ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈసారైనా స్పష్టమైన హామీ రాకపోతే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని యూనియన్‌ నాయకులు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగను కూడా దీక్ష శిబిరాల్లోనే నిర్వహించాలని నిశ్చయించారు. భోగి సందర్భంగా అంగన్‌వాడీ, మినీ టీచర్లకు, సహయకులకు ఇచ్చే నోటీసులను భోగీ మంటల్లో వేస్తామన్నారు.

'ఎస్మా చట్టాలకు భయపడం' - సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గెదే లేదు: అంగన్వాడీలు

Satya Sai District: ముఖ్యమంత్రి జగన్ చిత్రపటం ముందు దీపాలు వెలిగించి శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు ఉరితాడు వేసుకొని నిరసనను చేపట్టారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేసి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన ధర్నాలో రమాదేవి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నామని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు.

ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం: అంగన్వాడీలు

Ongole Collectorate: ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు నిరాహార దీక్ష నిర్వహించి, సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ రెండును తక్షణమే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. అంగన్వాడీలు రోడ్డెక్కి 31రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అంగన్వాడీలు మండిపడ్డారు. నోటీసులు ఇస్తే భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస పనికి కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీలు చెప్పారు. వైసీపీ నాయకులు అంగన్వా​డీ సెంటర్ల తాళాలు తీయమని మమ్మల్ని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

అంగన్వాడీల ఉద్యోగాలకు ఎసరు - విధుల్లోంచి తొలగిస్తున్నట్లు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.