విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు సంఘం ఆందోళన కార్యక్రమం చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో రైతు సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకులు సూర్యనారాయణ అన్నారు. ఒక రైతాంగమే కాకుండా అన్ని కార్మిక వ్యవస్థలను మంటగలిపి ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి, అన్ని వర్గాల కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :