గులాబ్ తుపాను వల్ల రాష్ట్రంలో 1.70లక్షల ఎకరాల్లో పంట నష్టం(CROP LOSS BY CYCLONE) జరిగినట్లు ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు., ఉభయ గోదావరి, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా పంట దెబ్బతింది. పంట నష్టం అంచనాలను మరో వారం రోజుల్లో పూర్తి చేసి.. బాధిత రైతులందరికీ ప్రభుత్వం నుంచి త్వరితగతిన పరిహారం అందేలా చూస్తామని విజయనగరం జిల్లాలో పర్యటించిన వ్యవసాయశాఖ రాష్ట్ర కమిషనర్ అరుణ్ కుమార్(AGRICULTURE COMMISSIONER OVER CROP LOSS DUE TO GULAB CYCLONE) తెలియచేశారు.
గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ప్రాథమిక అంచనా ప్రకారం 1.70లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిజిలాల్లో అధికంగా పంట నష్టం ఉందన్నారు. పంట నష్టాన్ని తగ్గించేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టిందని కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖాధికారులతో పాటు.. శాస్త్రవేత్తలు పొలాల్లో పర్యటించి., వర్షపునీటిలో మునిగిన పంట సంరక్షణ, సస్యరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇస్తున్నారని అరుణ్ కుమార్ వెల్లడించారు. రెండో దశలో పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి., ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కౌలుదారులకు పంట నష్టం అందేలా ఈ దఫా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలియచేశారు.
ఇదీ చదవండి:
OBSERVATION: గిరిజన విశ్వవిద్యాలయ స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం