ETV Bharat / state

Vizianagaram women won as MRS.Andhra Pradesh: ‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’గా గరివిడి మహిళ

Vizianagaram women won as MRS.Andhra Pradesh: విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన బి.పద్మావతి.. ‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ నెల 16న నిర్వహించిన తుది పోటీల్లో మంచి ప్రతిభ చూపిన పద్మావతి.. ‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

a women from garividi of vizianagaram won as MRS.Andhra Pradesh
‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’గా గరివిడి మహిళ
author img

By

Published : Jan 18, 2022, 7:29 AM IST

Vizianagaram women won as MRS.Andhra Pradesh: విజయనగరం జిల్లా గరివిడి పట్టణానికి చెందిన బి.పద్మావతి.. ‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవ(ఎన్‌జీవో) సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు మమతా త్రివేది.. ఆన్‌లైన్‌ వేదికగా ఈ అందాల పోటీలను నిర్వహించారు. 2021 సెప్టెంబరులో జరిగిన ప్రాథమిక పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వంద మంది యువతులు ఎంపిక కాగా వీరిలో 36 మంది అర్హత సాధించారు.

ఈ నెల 16న నిర్వహించిన తుది పోటీల్లో మంచి ప్రతిభ చూపిన పద్మావతి ‘మిసెస్‌ ఆంధ్రప్రదేశ్‌’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో విశాఖపట్నంలో నిర్వహించిన శ్రీమతి వైజాగ్‌ పోటీల్లోనూ ఈమె ఫైనల్స్‌కు అర్హత సాధించినప్పటికీ కొవిడ్‌ కారణంగా పాల్గొనలేకపోయారు. వివాహం అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఈమె తండ్రి రామకృష్ణ గరివిడిలోని ఫేకర్‌ పరిశ్రమలో సెక్యూరిటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి:

EMPLOYEES UNIONS REACTION: పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.