విజయనగరం జిల్లా కొప్పెర్ల గురుకుల పాఠశాలలో ప్రేమ్ కుమార్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వసతిగృహంలోని భోజనశాల నుంచి బయటకొస్తూ... సరదాగా వంట గదిలోని కుక్కర్‌ను పళ్లెంతో కొట్టాడు. అప్పటికే... ఉడికిన పప్పును చల్లార్చేందుకు కిందపెట్టిన కుక్కర్ మూత... పళ్లెం తాకి పైకి ఎగిసి పడింది. కుక్కర్లోని పప్పు, వేడినీళ్లు ఒక్కసారిగా ప్రేమ్ కుమార్‌పై పడ్డాయి.
ఈ ప్రమాదంలో విద్యార్థి శరీరమంతా బొబ్బలు వచ్చాయి. అప్రమత్తమైన గురుకుల పాఠశాల సిబ్బంది హుటాహుటిన భోగాపురం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం... పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై తల్లిదండ్రులు, సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: