ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించిన మాజీ ఎంపీ - donation of oxygen concentrators news

కరోనా వేళ ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్​ వంటివి ఎక్కువగా అవసరమయ్యాయి. పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాధితులకు సాయమందించారు. విజయనగరం జిల్లా కురుపాంలోని ప్రభుత్వాస్పత్రికి మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్​ దేవ్​ ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించారు.

oxygen concentrators
ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందిస్తున్న ఎంపీ
author img

By

Published : Jun 21, 2021, 6:01 PM IST

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రికి మాజీ ఎంపీ వైరిచర్ల ప్రదీప్​ దేవ్ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందించారు. ఆయన నివాసంలో ఆస్పత్రి యాజమాన్యానికి వాటిని అందజేశారు. ఎంపీ తండ్రి చంద్ర చూడమణి దేవ్ 100వ జన్మదినం సందర్బంగా నియోజకవర్గంలోని ఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు విరాళమిచ్చినట్లు ఆయన తెలిపారు. కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కోమరాడ మండలాల సామాజిక వైద్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలకు వీటిని వినియోగించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: కొవిడ్‌ మృతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.