ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా రెండవ విడత 'వ్యర్థాలపై యుద్ధం' - విశాఖలో ప్రారంభంకానున్న రెండవ దశ వ్యర్థాలపై యుద్ధం

పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో.. 'వ్యర్థాలపై యుద్ధం' రెండవ విడత కార్యక్రమాన్ని విశాఖ జిల్లా వ్యాప్తంగా అధికారులు చేపట్టనున్నారు. ఈనెల 7 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని 153 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని జడ్పీ సీఈవో నాగార్జున సాగర్ తెలిపారు.

war on wastage
మాట్లాడుతున్న విశాఖ జడ్పీ సీఈవో
author img

By

Published : Dec 5, 2020, 9:02 PM IST

'వ్యర్థాలపై యుద్ధం' రెండవ విడత కార్యక్రమాన్ని విశాఖ జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జడ్పీ ముఖ్య కార్య నిర్వహకాధికారి నాగార్జున సాగర్ తెలిపారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా.. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించామన్నారు.

జిల్లాలోని 153 గ్రామాలలోనూ ఈ కార్యక్రమం చేపడతామని.. జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున సాగర్ పేర్కొన్నారు. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు.. 15 రోజులపాటు నిర్వహిస్తామని వెల్లడించారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇచ్చేలా.. గ్రామస్థులను చైతన్యపరుస్తామని వివరించారు. ప్రజా ప్రతినిధులు భాగస్వాములై.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి రోజు జిల్లా, రెండవ రోజు మండల స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.

ఇదీ చదవండి:

భారత్ ఎఫెక్ట్: గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.