వైకాపా ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై సొంత పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నక్కపల్లి మండలం సీతం పాలెంలో పంచాయతీ సర్పంచి అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బాబూరావుకు.. సొంత పార్టీ కార్యకర్తలు నుంచి వ్యతిరేకత ఎదురైంది. పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు కాకుండా కొత్తగా వచ్చిన వారికి మద్దతు ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే గ్రూపులను నడుపుతున్నారని విమర్శించారు. ఈ కారణంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను అదుపు చేశారు.
ఇదీ చదవండీ... 'బెదిరించానని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా'