ETV Bharat / state

'విశాఖ గ్యాస్​ లీకేజీ పరిసర ప్రాంతాల్లో రాత్రి బస' - విశాఖ గ్యాస్ లీకేజ్ పరిహారం​ తాజా వార్తలు

స్థానికులకు భరోసా కల్పించేందుకు గ్రామాల్లో రాత్రి బస చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. విశాఖ గ్యాస్ లీకేజ్​ జరిగిన పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తామని మంత్రి తెలిపారు. నిపుణుల సూచనతో సాయంత్రం నుంచి ప్రజలను గ్రామాలకు తరలిస్తామన్నారు.

ysrcp govt will give lg polymers incident compensation to victims from tomorrow

author img

By

Published : May 11, 2020, 12:30 PM IST

ఎల్​జీ పాలిమర్స్ దుర్ఘటనపై కమిటీల నివేదిక ఆధారంగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. క్షతగాత్రులు, స్థానికులకు భరోసా కల్పించేందుకు కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రాత్రి బస చేస్తారని తెలిపారు. రేపటి నుంచి క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేయనున్నట్లు కన్నబాబు పేర్కొన్నారు.

కంపెనీలపై విచారణ చేస్తున్నాం: బొత్స

ఎల్‌జీ పాలిమర్స్ సహా ప్రమాదకరమైన కంపెనీలపై విచారణ చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. విచారణ కమిటీల నివేదిక ఆధారంగా సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: విశాఖ గ్యాస్​ లీకేజ్: మరో ముప్పు పొంచి ఉందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.