YSRCP Government Decisions Loss To IT Sector in AP : సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విధానాలతో విశాఖలో ఇప్పటికే ఐటీ రంగం (IT Sector in AP) కళావిహీనంగా మారింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పరిపాలన రాజధాని అంటూ హడావుడి చేస్తున్నారు. మిలీనియం టవర్స్‌ను (Millennium Towers) క్యాంపు కార్యాలయాలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఐటీ వాతావరణానికే విఘాతంగా మారింది. దీంతో ఇప్పటి వరకు సాగర తీరంలో ప్రశాంతంగా ఉన్న ఐటీ జోన్ (IT Zone)లో ఇకపై అధికారులు, మంత్రుల క్యాంపు కార్యాలయాలతో రద్దీ పెరగనుంది. ఫలితంగా ఉద్యోగులు, ప్రజలకు కొత్త కష్టాలు తప్పవనే విమర్శలు వినిపిస్తున్నాయి.
IT Sector in AP: అంకురాలను చిదిమేసిన వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో జాడలేని ఐటీ రంగం
AP Govt Decision to Allot Millennium Towers in Vishaka as Camp Offices : విశాఖలోని మిలీనియం టవర్స్‌లోని A,B భవనాల్లో 1.75 లక్షల చదరపు అడుగులు మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల క్యాంపు కార్యాలయాలకు కేటాయించాలని IASల కమిటీ నివేదిక ఇవ్వగా.. ప్రభుత్వం ఆమోదించింది. మిలేనియం టవర్స్-ఎలో మొదటి నాలుగు అంతస్తుల్లో ఇప్పటికే కాండ్యుయెంట్ ఐటీ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇలాంటి చోట క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో ఐటీ వాతావరణం దెబ్బతింటుందనడంలో సందేహమే లేదు. ఇటీవల హిల్ నంబరు-3లో హెలిప్యాడ్ నిర్మించారు. వివిధ కార్యక్రమాల కోసం వచ్చిన సీఎం జగన్ ఇక్కడే హెలికాఫ్టర్ దిగారు. ఆ సమయంలో పోలీసులు ఐటీ ఉద్యోగులకు ముచ్చెటమలు పట్టించారు. 3, 4 గంటల ముందే మధురవాడ, బీచ్‌రోడ్డులో రాకపోకలు నిలిపేయడంతో గంటల తరబడి ఎండలో ఇబ్బందులు పడ్డారు. షిఫ్టులకు వచ్చేవారు కూడా కార్యాలయాలకు చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఇక క్యాంపు కార్యాలయాలు ఇక్కడే ఉంటే కస్టమర్-క్లయింట్ ఫ్రెండ్లీ వాతావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఉత్తరాంధ్రపై సమీక్ష కోసం - యువతకు ఉద్యోగాలనిచ్చే మిలీనియం టవర్స్ కబ్జా! అన్ని శాఖలు విశాఖకు తరలింపు
Camp Offices in Visakhapatnam For Ministers : ఐటీ జోన్, పొలిటికల్ యాక్టివిటీ కలిసి ఉండటం దేశంలో ఎక్కడా లేదు. హిల్-3 స్పెషల్ ఎకనమిక్ జోన్ (Special Economic Zone)లో ఉంది. కానీ సెజ్ లక్ష్యాన్ని పక్కనపెట్టి., నాన్‌సెజ్ యాక్టివిటీని ఎలా చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీ కోసం గుర్తించిన జోన్‌లో కమర్షియల్ యాక్టివిటీ, పొలిటికల్ గెస్ట్‌హౌస్‌లు, క్యాంపు కార్యాలయాలేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సెజ్‌లోని హిల్-3లోనే మిలీనియం టవర్స్ ఉన్నాయి. ఐటీ సెక్రటరీ కార్యాలయాన్ని ఇక్కడికి ఇచ్చినా ఫర్వాలేదు కానీ, క్యాంపు కార్యాలయాలకు టవర్ మొత్తం కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు మిలీనియం టవర్‌లో భవనాలను ఐటీ కంపెనీలకు కేటాయించకుండా ప్రభుత్వం ఖాళీగా పెట్టుకుంది. ఈ లెక్కన టవర్-ఎలో నాలుగు అంతస్తులకు నాలుగున్నర సంవత్సరాలుగా 32కోట్ల 40 లక్షలు, టవర్-బిలో 36 కోట్ల ఆదాయాన్ని ఏపీఐఐసీ కోల్పోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
No Development in IT Sector: కాన్సెప్ట్ నగరాల ఊసే లేదు.. ఐటీ రంగంలో అభివృద్ధి లేదు..