విశాఖ పాడేరు ఏజెన్సీ జి.మాడుగుల మండలం మద్దులబందలో గబ్బాక జనార్దన్ అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. యువకుడికి మంగళవారం వివాహం జరగాల్సి ఉండగా.. ప్రమాదవశాత్తు మృత్యుఒడికి చేరాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో విద్యుత్ లేదని గుర్తించిన యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. దిగుతున్న క్రమంలో వైర్లు తాకి విద్యుదాఘాతానికి గురయ్యాడు.
యువకుడి ఒళ్లంతా ఇసుకతో కప్పి ప్రథమ చికిత్స చేసిన బంధువులు.. 108కి ఫోన్ చేశారు. ఫీడర్ అంబులెన్స్‌లో జి.మాడుగుల ఆస్పత్రికి తరలించారు. యువకుణ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహ ఏర్పాట్లతో కళకళలాడిన ఇల్లు ఒక్కసారిగా విచారంలో మునిగిపోయింది.
ఇదీ చదవండి: