చెరకు రసం అందరిలా అమ్మితే కొత్తగా ఏమి ఉంటుందని ఆలోచించాడు ఓ యువకుడు. సరి కొత్త ఆలోచనతో చెరకు రసం తయారు చేసే యంత్రంతో కూడిన మోటార్ వాహనం తయారు చేయించి లాభాలు ఆర్జిస్తున్నాడు. ట్రాఫిక్ చిక్కులు లేకుండా తన వాహనాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లి చల్లని చెరకు రసం అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నాడు. అతడే.. రాజస్థాన్ రాష్ట్రం బిల్వాడ జిల్లాకు చెందిన బిట్టు.
లక్ష రూపాయలతో చెరకు రసం తయారీ చేసే యంత్రంతో కూడిన వాహనాన్ని సమకూర్చుకున్నాడు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే జాతీయ రహదారిపై ఈ వాహనం నిలిపి... చెరకు రసం అమ్ముతున్నాడు. ఈ మొబైల్ చెరకు దుకాణం జాతీయ రహదారిపై ప్రయాణించే వారిని ఆకట్టుకుంటోంది. జనరేటర్ సహాయంతో ఈ వాహనం పనిచేస్తుంది. రూ.250లు డీజిల్ పెట్టుబడి పెడితే రోజంతా యంత్రం పనిచేస్తుందని బిట్టు తెలిపాడు. రోజుకు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ఆదాయం వస్తుందన్నాడు.
ఇదీ చదవండి: