విశాఖ జిల్లా కె. కొటపాడు మండలం గొండుపాలెంకు చెందిన కూండ్రపు రాజేశ్(19) విద్యుదాఘాతానికై గురై మృతి చెందాడు. ఆదివారం రాజేశ్ ఓ ఇంటి నిర్మాణానికి కూలీ పనికి వెళ్లాడు. ఇసుకను కిందకు అన్లోడ్ చేస్తుండగా లారీని తిప్పుతున్న సమయంలో విద్యుత్ తగిలి రాజేశ్ విద్యుదాఘాతానికి గురైయ్యాడు. ప్రమాద స్థలంలోనే రాజేశ్ మరణించాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబాన్ని పోషిస్తున్న కొడుకు మృతి చెందటంతో రాజేశ్ తల్లీ కన్నీటి పర్యంతమైంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కె. కొటపాడు ఎస్సై మల్లేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి