రాష్ట్రంలో తెలుగు భాషను పాలనా వ్యవహారాల్లో ఎక్కువగా వాడేలా చర్యలు చేపడతానని.. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో అన్నారు.. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ చాలా విభాగాలు ఇప్పటికీ కొన్ని చోట్ల ఇంగ్లీషులో శిలాఫలకాలు, బోర్డులు, అహ్వాన పత్రాలు వేస్తున్నారని ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. ప్రాథమిక స్ధాయిలో తప్పనిసరిగా తెలుగులో బోధించే విధంగా, ఇంటర్ వరకు తెలుగు ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా కూడా అభ్యసించేలా చూడాలన్నది తన లక్ష్యమని ఈటీవీ భారత్తో అన్నారు.
ఇదీచూడండి.'తెలుగు భాషలో మాట్లాడండి.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్'