విశాఖ జిల్లా ఎలమంచిలి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి... ఒక్క రోజులోనే ఐదున్నర కోట్ల రూపాయల ఆదాయం లభించింది. అచ్యుతాపురం మండలంలోని అద్దాల పరిశ్రమ ఏర్పాటుకు... ఏపీఐఐసీ నుంచి అంతర్జాతీయ సంస్థ 180 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం... స్టాంప్ డ్యూటీగా అద్దాల పరిశ్రమ.. అయిదున్నర కోట్ల రూపాయాన్ని ప్రభుత్వానికి చెల్లించింది. ఎకరా భూమి 60 లక్షల రూపాయల చొప్పున సంస్థ కొనుగోలు చేసింది. ఒకే రోజు ఒక రిజిస్ట్రేషన్ ద్వారా ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమని సబ్ రిజిస్టార్ శ్రీనివాస రావు తెలిపారు.
ఇదీ చదవండి; ఆ ఆర్ఐ... రూ.18 లక్షలు వసూలు చేశాడట!