విశాఖ జిల్లా ఎలమంచిలి సర్కిల్ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లు, ప్రధాన కూడళ్లు, దుకాణాల వద్ద పోలీసులు మైకు పట్టుకుని భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రచారం చేశారు. ఎలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలంలో పోలీసులు ఆదివారం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలను చైతన్య పరచడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని స్థానిక సీఐ వెంకటరమణ తెలిపారు. ప్రచారం కోసం ప్రత్యేక వాహనాలను సమకూర్చారు.
ఇదీ చదవండి :