హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రానంత మాత్రన న్యాయస్థానాల పట్ల తమకు గౌరవం పోదని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. రమేశ్ కుమార్ తొలగింపును తెదేపా, భాజపా రాజకీయాలు చేశాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ అనేది పార్టీలకు అతీతంగా పని చేయాలని కానీ... నిమ్మగడ్డ రమేశ్ పక్షపాతి ధోరణితో వ్యవహరించారని అన్నారు. ఎస్ఈసీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. న్యాయస్థానాలపై తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినవారు ఎవరూ ఉండరని విమర్శించారు.
నోటీసులు ఇంకా అందలేదు..
'గతంలో ఏమైనా వ్యాఖ్యలు చేసుంటే భావోద్వేగంతో మాత్రం చేసినవే. మాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు వచ్చాయని మీడియాలో చూశా. ఇంకా తనకు నోటీసులు అందలేదు. నోటీసులు అందిన తర్వాత స్పందిస్తాను' - గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే
ఇదీ చదవండి: