అక్రమాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబుకు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విజయసాయిరెడ్డికి సరితూగని వెలగపూడి రామకృష్ణబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదని అమర్నాథ్ హెచ్చరించారు. వంగవీటి మోహన్‌రంగ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వెలగపూడి.. విశాఖలో దొంగచాటుగా తలదాచుకోవడానికి వచ్చి ఇప్పుడు కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి తో సమానమైన స్థాయి లేని వెలగపూడి ఆయనపై సవాలు విసరడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
వెలగపూడికి సవాల్ :
వెలగపూడి రామకృష్ణ బాబు నిజంగా అక్రమాలు చేయకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే ధైర్యం ఉందా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఆయనకు ధైర్యం ఉంటే ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం దేవస్థానంకి వచ్చి ఒట్టు వేయాలని సవాల్ విసిరారు. ఆయన తన సవాలు స్వీకరించి నట్లయితే ఏరోజు ఏ సమయానికి వస్తారో చెప్పాలన్నారు.
ఇదీ చదవండి :
విశాఖ బీచ్ రోడ్డులో భూగర్భ మార్గం..తీరనున్న ట్రాఫిక్ సమస్యలు