రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేయడానికి, వాటిని ఇప్పుడు మార్చడానికి అయిన ఖర్చును వైకాపా నాయకులే భరించాలని మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జీ పీలా గోవింద సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనకాపల్లి తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సచివాలయాలకు మొదట రంగులు వేయడానికి 1400 కోట్లు, ఇప్పుడు వీటిని తొలగించి మరో రంగు వేయడానికి మరో 1400 కోట్ల రూపాయలను వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసిందని అంచనా వేశారు. రంగుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా వైకాపా సర్కార్ వ్యవహరించిందని ఆయన దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: నన్ను పక్కకు తప్పించేందుకు స్కెచ్ వేశారు: రఘురామకృష్ణరాజు